YSRCP: పది కోట్లు ఇచ్చి నా మొత్తం ఆస్తిని తీసుకోండి!: జగన్‌కు జ్యోతుల నెహ్రూ సవాల్

  • జగన్ వ్యాఖ్యలకు నెహ్రూ కౌంటర్
  • రూ. పది కోట్లు ఇచ్చి తన ఆస్తిని తీసుకోవాలని సవాల్
  • జగన్‌ను పరిపక్వత లేని నేతగా తేల్చేసిన ఎమ్మెల్యే

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సవాలు విసిరారు. టీడీపీ పెద్ద ఎత్తున డబ్బులను ఎరగా చూపి వైసీపీ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తోందని, టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలందరూ డబ్బులు తీసుకున్నారని జగన్ చేసిన వ్యాఖ్యలను నెహ్రూ ఖండించారు. తనకు పది కోట్ల రూపాయలు ఇస్తే తన మొత్తం ఆస్తిని జగన్‌కు రాసిచ్చేస్తానని సవాలు విసిరారు. తనకు చాలా వరకు అప్పులున్నాయని, ఆ పది కోట్లతో అప్పులు కూడా తీర్చుకుంటానని పేర్కొన్నారు. జగన్‌కు దమ్ముంటే తన సవాలుకు ముందుకు రావాలన్నారు. జగన్ ఓ పరిపక్వత లేని నేత అని దుయ్యబట్టారు. రాజకీయాలకు ఆయన పనికిరారని నెహ్రూ తేల్చి చెప్పారు.

YSRCP
Jagan
Andhra Pradesh
Telugudesam
jyotula Nehru
MLA
  • Loading...

More Telugu News