Jagan: జగన్ అలా అనలేదని వైసీపీ నాయకులు చెప్పడం హాస్యాస్పదం: చినరాజప్ప

  • కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేమని జగన్ చెప్పారుగా
  • జగన్ చేసిన వ్యాఖ్యలను చేయలేదంటారా?
  • కాపులకు న్యాయం చేస్తామని జగన్ చెప్పొచ్చుగా? 

కాపులకు రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధిలోనిది కాదంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప విమర్శలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేమని జగ్గంపేట సభలో జగన్ స్పష్టంగా చెప్పారని, ఇప్పుడు, అలా అనలేదని వైసీపీ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

 కాపులకు రిజర్వేషన్ల విషయంలో న్యాయం చేస్తానని జగన్ తో చెప్పించాలని ఆ పార్టీ నేతలను డిమాండ్ చేశారు. అసలు కాపులకు న్యాయం చేస్తామని చెప్పడానికి జగన్ కు ఉన్న ఇబ్బందేమిటి? అని ఆయన ప్రశ్నించారు. నాడు మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ కాపుల సర్వేకు రూ.40 లక్షలు కేటాయించలేకపోయారని విమర్శించారు. 

Jagan
china rajappa
  • Loading...

More Telugu News