lowrence raghava: శ్రీరెడ్డి పట్ల జాలిపడుతున్నాను .. భయపడటం లేదు: లారెన్స్

  • శ్రీరెడ్డి ఆరోపణల్లో నిజం లేదు
  • టాలెంట్ ను నిరూపించుకోవాలి
  • అవకాశం ఇచ్చేందుకు నేను సిద్ధం

సినిమాల్లో అవకాశాలు ఇస్తామని చెప్పేసి తనని మోసం చేశారంటూ, కోలీవుడ్ లోని కొంతమంది హీరోలపైన .. దర్శక నిర్మాతలపైన శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో లారెన్స్ పేరు కూడా వుంది .. దాంతో తాజాగా ఆయన స్పందించాడు. "శ్రీరెడ్డి ఆరోపణలను గురించి అంతా నన్ను అడుగుతున్నారు .. అదే పనిగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. దాంతో ఈ వివాదానికి ముగింపు పలకాలని అనుకుంటున్నాను.

 శ్రీరెడ్డి ఆరోపణలలో ఎంతమాత్రం వాస్తవం లేదు. 'రెబల్' సినిమా సమయంలో ఆమె నన్ను కలిసింది .. ఆ సినిమా వచ్చి దాదాపు ఏడేళ్లు అయింది .. ఇంతవరకూ ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఆ సమయంలో హోటల్లోని నా రూములో దేవుళ్ల ఫోటోలు .. రుద్రాక్ష మాలలు ఉన్నాయని చెప్పింది. హోటల్ రూమ్ లో అవన్నీ పెట్టుకోవడానికి నేనేమైనా పిచ్చివాడినా? శ్రీరెడ్డి తన టాలెంట్ ను నిరూపించుకుంటే అవకాశం ఇవ్వడానికి నేను సిద్ధంగా వున్నాను. ఆమె పరిస్థితి పట్ల నేను జాలి పడుతున్నానే గానీ .. భయపడటం లేదు" అంటూ స్పష్టం చేశాడు.    

lowrence raghava
sri reddy
  • Loading...

More Telugu News