lagadapati: కాంగ్రెస్ కు పట్టిన గతే.. బీజేపీకి పడుతుంది: లగడపాటి

  • ప్రత్యేక హోదా ఇవ్వకపోతే బీజేపీకి అదే గతి 
  • ప్రాణత్యాగాలతో ప్రత్యేక హోదా రాదు
  • ఎన్నికలకు ముందు సర్వే వివరాలను వెల్లడిస్తా

రాష్ట్రాన్ని విభజించినందుకు ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారని... ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే బీజేపీకి కూడా అదే గతి పడుతుందని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ప్రాణత్యాగాలతో ప్రత్యేక హోదా రాదని, పోరాటాల ద్వారానే హోదాను సాధించగలమని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే... పరిశ్రమలు రాష్ట్రానికి వస్తాయని, తద్వారా ఉద్యోగాలు లభిస్తాయని ప్రజలు బలంగా నమ్ముతున్నారని తెలిపారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు. ఎన్నికలకు ముందు సర్వే వివరాలను విడుదల చేస్తానని తెలిపారు.

lagadapati
special status
  • Loading...

More Telugu News