Tamilnadu: కరుణానిధిని పరామర్శించిన పళనిస్వామి, పన్నీర్ సెల్వం

  • సేలం నుంచి చెన్నై వచ్చిన పళనిస్వామి
  • ఆ వెంటనే కావేరీ ఆసుపత్రికి
  • వైద్యులను వివరాలు అడిగిన సీఎం

చెన్నై కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ సీఎం కరుణానిధిని ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కొద్దిసేపటి క్రితం పరామర్శించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సేలంకు వెళ్లిన పళనిస్వామి, నేటి అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని చెన్నై వచ్చారు.

కరుణానిధి ఆరోగ్యం విషమంగా ఉందని తెలుసుకున్న ఆయన, హుటాహుటిన వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఐసీయూలో ఉన్న కరుణానిధిని చూసి వచ్చిన పళనిస్వామి, ఆసుపత్రి వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. కాగా, ఆసుపత్రి బయట భారీ సంఖ్యలో ఉన్న డీఎంకే కార్యకర్తలు, నేతలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నా ఎవరూ వినని పరిస్థితి నెలకొంది.

Tamilnadu
Karunanidhi
Palani Swamy
Panner Selvam
  • Loading...

More Telugu News