Chittoor District: శుక్రవారం నాడు ఇల్లొదిలి వెళ్లిన యువతి... సోమవారం నాడు బావిలో విగతజీవిగా.. చిత్తూరు జిల్లాలో ఘటన!

  • చిత్తూరు జిల్లా రెడ్డిగుంటలో కలకలం
  • పోలీసులు వెతుకుతుంటే మృతదేహమై కనిపించిన సంగీత
  • ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం

మూడు రోజుల క్రితం ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిన సంగీత అనే యువతి, ఈ ఉదయం బావిలో శవమై కనిపించడంతో చిత్తూరు జిల్లా రెడ్డిగుంటలో కలకలం రేపింది. డిగ్రీ చదువుతున్న సంగీత, శుక్రవారం ఇంటి నుంచి కాలేజీకని చెప్పి వెళ్లింది. ఆపై రాత్రయినా ఇంటికి రాలేదు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

ఈ నేపథ్యంలో రెడ్డిగుంట శివారులోని ఓ బావిలో మృతదేహం పైకి తేలిందంటూ పోలీసులకు సమాచారం అందడంతో, వారు వెళ్లి ఆ మృతదేహం సంగీతదేనని తేల్చి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. సంగీత ఓ యువకుడిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నట్టు స్థానికులు చెప్పడంతో, ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఆమె మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని బంధువులు చెప్పడంతో పోలీసులు ఆ దిశగా దర్యాఫ్తు ప్రారంభించారు.

Chittoor District
Sucide
Sangeeta
Love Affair
  • Loading...

More Telugu News