Cheeta: జంటపై దాడి చేసి వారి బిడ్డను ఎత్తుకెళ్లిన చిరుతపులి... అయినా మృత్యుంజయుడే!

  • గుజరాత్ లోని వడోదర సమీపంలో ఘటన
  • బైక్ పై వెళుతుంటే చిరుత దాడి
  • ఆపై బిడ్డను వదిలి అడవిలోకి

అసలు సిసలైన మృత్యుంజయుడంటే వీడేనేమో. చిరుతపులి నోట కరచుకుని వెళ్లినా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన గుజరాత్ లోని వడోదరకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోటా ఉదయ్ పూర్ జిల్లా గిరిజన ప్రాంతంలో జరిగింది. విక్రమ్ రాథ్వా, స్వప్న దంపతులు తమ నాలుగు నెలల బిడ్డ ఆయుష్ తో కలసి ద్విచక్రవాహనంపై అటవీ మార్గం గుండా వెళుతుంటే, వారిపై చిరుత దాడి చేసింది.

స్వప్నను గాయపరిచి, ఆమె చేతిలోని బిడ్డను నోట కరచుకుని వెళ్లింది. వెంటనే అలర్ట్ అయిన భర్త గట్టిగా కేకలు వేస్తూ, సమీపంలోని స్థానికులను అలర్ట్ చేశాడు. వారంతా పరుగున వచ్చి చిరుతను భయపెట్టే ప్రయత్నం చేయడంతో అది బిడ్డను వదిలి పరారైంది. ఈ ఘటనలో ఆయుష్ గాయాల పాలయ్యాడని, ఈ ముగ్గురినీ శ్రీ సాయాజీరామ్ జనరల్ హాస్పిటల్ కు తరలించామని అధికారులు తెలిపారు. చిన్నారికి వీపుపై, కాళ్లపై గాయాలు అయ్యాయని అన్నారు.

Cheeta
Gujarath
Vadodara
Bike
Infant
  • Loading...

More Telugu News