Trisha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • త్రిషకు జయలలిత పాత్ర చేయాలనుందట!
  • తమిళ, మలయాళ భాషల్లోకి 'రంగస్థలం'
  • ఆగస్టు 17న నయనతార కొత్త సినిమా 
  • పూర్తి కామెడీతో 'వెంకీ మామ' 

*  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత పాత్రను పోషించాలని వుందని చెప్పింది చెన్నయ్ బ్యూటీ త్రిష. 'నా అభిమాన రాజకీయ నాయకురాలు జయలలిత. ఆమె బయోపిక్ ను ఎవరైనా తీస్తే కనుక నేను తప్పకుండా ఆమె పాత్రను పోషించడానికి రెడీ. అలా అని నాకు రాజకీయాల్లోకి రావాలన్న కోరిక మాత్రం లేదు' అని చెప్పింది.
*  రాంచరణ్, సమంత జంటగా నటించిన 'రంగస్థలం' చిత్రం భారీ విజయాన్ని సాధించి సుమారు 200 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడీ చిత్రాన్ని తమిళ, మలయాళ భాషల్లోకి అనువదిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీలను ప్రకటిస్తారు.
*  నయనతార తమిళంలో నటించిన 'కొలమావు కోకిల' చిత్రాన్ని తెలుగులో 'కోకో కోకిల' పేరిట అనువదిస్తున్నారు. డ్రగ్స్ అమ్మే యువతిగా నయనతార నటించిన ఈ చిత్రాన్ని ఆగస్టు 17న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తారు.
*  వెంకటేశ్, నాగ చైతన్య హీరోలుగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న 'వెంకీ మామ' చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల 8 నుంచి జరుగుతుంది. పూర్తి కామెడీ చిత్రంగా రూపొందే ఇందులో వెంకీ సరసన హ్యూమా ఖురేషి నటిస్తుండగా, చైతూకి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. 

Trisha
charan
samantha
Nayanatara
  • Loading...

More Telugu News