Cellphone: పేలిన సెల్‌ఫోన్.. తెగిపడిన బాలుడి వేళ్లు.. కర్నూలులో ఘటన!

  • సెల్‌ఫోన్‌లో పాటలు వింటుండగా ఘటన
  • భారీ శబ్దంతో పేలిన ఫోన్
  • తీవ్రంగా గాయపడిన బాలుడు

చేతిలోని సెల్‌ఫోన్ అకస్మాత్తుగా పేలడంతో బాలుడి చేతివేళ్లు తెగిపడ్డాయి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పెండేకల్లులో ఈ ఘటన జరిగింది. జనార్దన్ అనే తొమ్మిదేళ్ల బాలుడు తండ్రి మొబైల్ ఫోన్ తీసుకుని పాటలు వింటుండగా అది ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. బాలుడి చేతి వేళ్లు తెగి పడడంతోపాటు పొట్టకు కూడా గాయమైంది. దీంతో వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించారు.

సెల్‌ఫోన్లు పేలడం ఇదేమీ కొత్తకాదు. గతంలో అనంతపురం జిల్లా తూమకుంటలో ఫోన్ బ్యాటరీ పేలడంతో ఏడేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. దుక్కిల్-రాణి దంపతుల ఏడేళ్ల కుమారుడు లలిత్ పాడైన బ్యాటరీతో ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆ బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించడంతో పెను ప్రమాదం తప్పింది.

Cellphone
Kurnool District
Blast
Boy
  • Loading...

More Telugu News