Jagan: జగన్ పాదయాత్రను అడ్డుకున్న కాపు నాయకులు

  • జగన్ పాదయాత్రకు ‘కాపు’ సెగ
  • కిర్లంపూడి మండలంలో పాదయాత్రను అడ్డుకున్న వైనం
  • ‘కాపులను మోసం చేయొద్దు’ అని నినాదాలు

వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు ‘కాపు’ సెగ తగిలింది. తూర్పుగోదావరి జిల్లాలోని కిర్లంపూడి మండలం గోనేడలో జగన్ పాదయాత్రను కాపు నాయకులు అడ్డుకున్నారు. ప్లకార్డులు చేత బూనిన కాపు యువత నాయకులు ‘కాపులను మోసం చేయొద్దు’ అంటూ నినాదాలు చేశారు. దీంతో, కాపు నేతలను జగన్ సెక్యూరిటీ సిబ్బంది పక్కకు నెట్టేశారు. కాగా, కాపు రిజర్వేషన్ల అంశంపై తాను హామీ ఇవ్వలేనని జగన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలపై  టీడీపీ నేతలు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తప్పుబట్టారు. 

Jagan
kapu leaders
  • Loading...

More Telugu News