Kodali Nani: 200 రోజులు ఆగండి.. చుక్కలు చూపిస్తా: తెలుగుదేశం నేతలకు కొడాలి నాని వార్నింగ్

  • పోలీసులు, అధికారులు టీడీపీ తొత్తులుగా మారారని మండిపాటు
  • తెలుగుదేశాన్ని గుడివాడలో భూస్థాపితం చేస్తానని ప్రకటన
  • మీడియా సమావేశంలో నిప్పులు చెరిగిన నాని

వైఎస్సార్ సీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు(నాని) ఈ రోజు తెలుగుదేశం నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంకో 200 రోజులు ఆగితే గుడివాడలో తెలుగుదేశం నేతలకు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. పోలీసులు, అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని మండిపడ్డారు. గుడివాడలోని శరత్ థియేటర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో నాని మాట్లాడారు.


తనను గుడివాడ నుంచి తరిమికొడతామని తెలుగుదేశం నేతలు చెప్పడంపై నాని తీవ్రంగా స్పందించారు. ఇంకో 200 రోజులు ఆగితే గుడివాడలో టీడీపీని భూస్థాపితం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. అప్పుడు టీడీపీ నేతల్ని తరిమితరిమి కొడతానన్నారు. వైఎస్సార్ సీపీ నేతలను ఇబ్బందులకు గురిచేస్తున్న నేతలకు అసలు రాజకీయ జీవితమే లేకుండా చేస్తానని హెచ్చరించారు.

Kodali Nani
gudiwada
Mla
Telugudesam
YSRCP
200 days
  • Loading...

More Telugu News