Narendra Modi: ప్రజాస్వామ్యానికి మోదీనే సరైన వ్యక్తి.. బాలీవుడ్ నటి కంగన

  • ఆయన నిఖార్సయిన ప్రజా నాయకుడని కితాబు
  • ప్రధానిగా మరోసారి అవకాశం ఇవ్వాలన్న ముద్దుగుమ్మ
  • ముంబైలో ‘చలో జీతే హై’ స్ర్కీనింగ్ కు హాజరు

బాలీవుడ్ నటి, ఫిల్మ్ ఫేర్ అవార్డు గ్రహీత కంగనా రనౌత్ ప్రధాని నరేంద్ర మోదీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రధాని మోదీ నిఖార్సయిన ప్రజా నాయకుడని వెల్లడించింది. వచ్చే ఎన్నికల్లో మోదీకి మరోసారి ప్రధానిగా అవకాశం ఇవ్వాలని ఈ ముద్దుగుమ్మ అభిప్రాయపడింది. ప్రజాస్వామ్యానికి మోదీనే సరైన వ్యక్తి అని కంగన వ్యాఖ్యానించింది. మోదీ జీవితంలోని ఘటనల ఆధారంగా ‘చలో జీతే హై’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. శనివారం రాత్రి ముంబైలో ప్రదర్శించిన ఈ సినిమా ప్రత్యేక స్ర్కీనింగ్ కు కంగన హాజరైంది.


అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మోదీ జీవితంలో ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారనీ, ఆయనకు ప్రధానిగా మరోసారి అవకాశం ఇవ్వాలని కంగన చెప్పింది. ప్రధాని పదవికి ఆయన అర్హుడైన వ్యక్తని కితాబిచ్చింది. మోదీ జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులు, ఆయన బాల్యాన్ని ఈ సినిమాలో అద్భుతంగా చూపారని కంగన ప్రశంసించింది. ఆనంద్ ఎల్. రాయ్, మహవీర్ జైన్ లు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Narendra Modi
kangana
chalo jeete hain
mumbai
filmfare
  • Loading...

More Telugu News