hacking: డబ్బు ఇవ్వలేదో.. నీ గుట్టు బయటపెడతా!: బెంగళూరు టెక్కీకి హ్యాకర్ బెదిరింపులు

  • వెబ్ క్యామ్ ను హ్యాక్ చేసిన ఆకతాయి
  • వ్యక్తిగత వీడియోలు రికార్డు
  • బిట్ కాయిన్లలో రూ.లక్షన్నర చెల్లించాలని డిమాండ్

ఇప్పటివరకూ మాల్ వేర్లు, వైరస్ ల ద్వారా సైబర్ దాడికి పాల్పడే హ్యాకర్లు రూటు మార్చారు. వాన్నా క్రై వంటి ప్రమాదకరమైన సాఫ్ట్ వేర్ సాయంతో కంప్యూటర్ మొత్తాన్ని తమ స్వాధీనంలోకి తీసుకుని నగదు చెల్లిస్తేనే మీ సమాచారాన్ని సురక్షితంగా వెనక్కి ఇస్తామని మెలిక పెట్టారు. తాజాగా బెంగళూరులో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఇంట్లోని వెబ్ క్యామ్ ను హ్యాక్ చేసిన ఆకతాయి.. అతనికి తెలియకుండానే వీడియోలను రికార్డు చేశాడు. చివరికి బిట్ కాయిన్ల రూపంలో రూ. లక్షన్నర చెల్లించకుంటే ఈ వీడియోలను కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న అందరికీ పంపిస్తానని హెచ్చరించాడు. ఈ మేరకు అతన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ ఈ-మెయిల్ పంపాడు.


అశ్లీల సైట్లు చూసే సమయంలో తాను అభివృద్ధి చేసిన వైరస్ మొబైల్ లోకి ప్రవేశించిందని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు హ్యాకర్ మెయిల్ లో తెలిపాడు. ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ సాయంతో తాను వెబ్ క్యామ్ ను కూడా హ్యాక్ చేశాననీ, సదరు ఇంజనీర్ కు సంబంధించి తన వద్ద అభ్యంతరకరమైన వీడియోలు ఉన్నాయని వెల్లడించాడు. రూ.1.5 లక్షల నగదును బిట్ కాయిన్ల రూపంలో చెల్లించకుంటే ఈ వీడియోలను కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న అందరికీ పంపిస్తానని హెచ్చరించాడు. దీంతో బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News