BSNL Employee: లక్ష అసలుకు నెలకు 16 వేల వడ్డీ వసూలు... సెల్ఫీ వీడియో తీసుకుని బాధితుడి ఆత్మహత్య!

  • గత నెల 29న ఉయ్యూరు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి ఆత్మహత్య
  • ఆత్మహత్యకు ముందు వేధింపులపై సెల్ఫీ వీడియో
  • నెల రోజుల తరువాత వెలుగులోకి

గత నెల 29న ఆత్మహత్య చేసుకున్న ఉయ్యూరు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి చిట్టిబాబు కేసును విచారిస్తున్న పోలీసులకు విస్తుపోయే అసలు నిజం తెలిసింది. చిట్టిబాబు ఆత్మహత్య చేసుకున్న తరువాత, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారిస్తున్న పోలీసులు, ఆయన సెల్ ఫోన్ ను సీజ్ చేసి విశ్లేషించగా, అందులో సెల్ఫీ వీడియో కనిపించింది.

ఓ వడ్డీ వ్యాపారి వద్ద చిట్టిబాబు రూ. లక్ష అప్పు తీసుకోగా, నెలకు దానికి రూ. 16 వేల వడ్డీ వేసి, తన నుంచి ఇప్పటివరకు రెండున్నర లక్షలకు పైగా వసూలు చేశారని, అసలు మాత్రం తీరలేదని చెబుతూ, ఇల్లు అమ్మాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని, అందువల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని ఈ వీడియోలో చిట్టిబాబు వెల్లడించాడు. కేసు మరో మలుపు తిరగడంతో, చిట్టిబాబును వేధించిన వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు, వారిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు.

BSNL Employee
Selfi Video
Sucide
  • Loading...

More Telugu News