Palo Alto: ఇంట్లో దూరిన దొంగ.. నిద్రిస్తున్న జంటను లేపి ఏమడిగాడో తెలుసా?

  • అమెరికాలో కొత్తరకం దొంగ
  • వై-ఫై పాస్‌వర్డ్ అడిగిన వైనం
  • నివ్వెరపోయిన వృద్ధ జంట

నిశిరాత్రి వేళ ఇంట్లోకి ప్రవేశించిన దోపిడీ దొంగ ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. అమెరికాలోని కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోలో జరిగిన ఈ ఘటన దొంగతనాల్లో సరికొత్త ఒరవడికి నాంది పలుకుతుందేమో చూడాలి. ఇంతకీ ఏం జరిగిందంటే.. 60 ఏళ్ల వయసున్న దంపతుల ఇంట్లోకి 17 ఏళ్ల దొంగ అర్ధరాత్రి వేళ చడీచప్పుడు కాకుండా ప్రవేశించాడు. గాఢనిద్రలో ఉన్న దంపతులను నెమ్మదిగా తట్టిలేపిన దొంగను చూసి వృద్ధ జంట హడలిపోయింది. అంతలోనే నిభాయించుకున్న వృద్ధుడి వైపు చూస్తూ దొంగ చేసిన రిక్వెస్ట్‌కు అతడు ఆశ్చర్యపోయాడు.

వై-ఫై పాస్‌వర్డ్ చెప్పాలని దొంగ అడగడంతో వృద్ధ దంపతుల నోటమాట రాక అలాగే ఉండిపోయారు. కాసేపటికి తేరుకుని దొంగను ఒడుపుగా పట్టుకుని తన్ని బయటకి పంపేసి తలుపులు మూసివేశాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడిపై ఇప్పటికే బైక్ దొంగతనం కేసు నమోదై ఉన్నట్టు పాలో ఆల్టో పోలీసులు తెలిపారు. 

Palo Alto
America
Burglar
Wi-Fi
  • Loading...

More Telugu News