Tirumala: టీటీడీ చరిత్రలో తొలిసారి... ఆగస్టు 16 నుంచి ఉద్యోగుల సమ్మె!

  • జేఏసీని ఏర్పాటు చేసుకున్న ఉద్యోగులు
  • పాలక మండలికి సమ్మె నోటీసు
  • సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్న బోర్టు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలో ఉద్యోగులు తొలిసారిగా సమ్మె సైరన్ మోగించారు. గతంలో సమస్యలు ఏవైనా ఉంటే, ఆ విభాగపు ఉద్యోగులు మాత్రమే తమ నిరసనలను తెలియజేస్తుండేవారు. కానీ, ఇటీవల అన్ని విభాగాల్లోని ఉద్యోగులూ జేఏసీని ఏర్పాటు చేసుకుని, తమ డిమాండ్లను పాలక మండలి ముందు ఉంచిన సంగతి తెలిసిందే.

తాజాగా ఉద్యోగ సంఘాలు, టీటీడీకి సమ్మె నోటీసును ఇచ్చాయి. ఆగస్టు 16 నుంచి తాము సమ్మెకు దిగబోతున్నట్టు ఈ నోటీసులో పేర్కొన్నాయి. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరాయి. అంతకుముందు బోర్డు సభ్యుడు రామచంద్రారెడ్డి, ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను చైర్మన్ తో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రామచంద్రారెడ్డి చెప్పిన సమాధానంతో తృప్తి చెందని ఉద్యోగులు, ఈ నోటీసులు ఇచ్చారు. 

  • Loading...

More Telugu News