Imran khan: ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి గవాస్కర్, కపిల్, సచిన్?

  • ప్రమాణ స్వీకారానికి ఇమ్రాన్ ఏర్పాట్లు
  • భారత దిగ్గజ క్రికెటర్లకు ఆహ్వానం
  • వెళ్లే అవకాశం ఉందన్న ‘రా’ మాజీ చీఫ్

నేడో, రేపో పాకిస్థాన్‌లో కొత్త పౌర ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ప్రభుత్వ ఏర్పాటులో ఇమ్రాన్ ఖాన్ బిజీగా ఉన్నారు. క్రికెటర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ఇమ్రాన్‌కు  ఇప్పటికీ క్రికెటర్లతో సంబంధాలున్నాయి. ముఖ్యంగా గవాస్కర్‌తో ఇమ్రాన్‌కు ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీలు చిక్కినప్పుడల్లా ఇద్దరూ ఫోన్‌లో ముచ్చట్లాడుకుంటారు.

పాక్ నూతన ప్రధానిగా ఇమ్రాన్ ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ భారత  దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్ ఆయన పక్కన ఉండే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయాన్ని భారత గూఢచార సంస్థ ‘రా’ మాజీ చీఫ్ ఏఎస్ దౌలత్ తెలిపారు. తన ప్రమాణ స్వీకారానికి ఈ ముగ్గురిని ఇమ్రాన్ ఆహ్వానిస్తాడని పేర్కొన్నారు. గవాస్కర్-ఇమ్రాన్‌లు పక్కపక్కనే కూర్చుని ముచ్చట్లాడుకునే అవకాశం ఉందన్న దౌలత్.. రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలను అది పరిష్కరించలేదని చెప్పడం గమనార్హం. ఇమ్రాన్ ప్రధాని అయితే సునీల్ గవాస్కర్‌ను భారత్ హైకమిషనర్‌గా పంపిస్తుందంటూ గతంలో తాను వేసిన జోక్‌ను ఈ సందర్భంగా దౌలత్ గుర్తు చేసుకున్నారు.

Imran khan
Pakistan
Sunil Gavaskar
Sachin Tendulkar
Kapil dev
  • Loading...

More Telugu News