సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- మళ్లీ బిజీ అవుతున్న కాజల్ అగర్వాల్
- కార్తీ చిత్రానికి 50 కోట్ల బడ్జెట్టు
- రామేశ్వరంలో వరుణ్ తేజ్ షూటింగ్
* ఇటీవల 'చినబాబు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో కార్తీ ప్రస్తుతం 'దేవ్' అనే భారీ చిత్రంలో నటిస్తున్నాడు. 50 కోట్ల బడ్జెట్టుతో రూపొందుతున్న ఈ చిత్రం తాజా షెడ్యూలు త్వరలో ఉక్రెయిన్ లో జరుగుతుంది. రజత్ రవిశంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది.
* వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న స్పేస్ థ్రిల్లర్ షూటింగ్ తమిళనాడులోని రామేశ్వరంలో జరుగుతోంది. అక్కడి అబ్దుల్ కలాం స్కూల్ లో ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నారు. ఇందులో లావణ్య త్రిపాఠి, అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.