Karnataka: పాడుబడిన బావిలో వందలకొద్దీ రాకెట్ లాంచర్లు!

  • 18వ శతాబ్దపు రాకెట్ గుళ్లు
  • సుమారు 1000 రాకెట్లు వెలికితీత
  • యుద్ధాలలో వాడేందుకు దాచి వుంచారన్న ఆర్కియాలజిస్టులు

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఓ పురాతన బావిని తవ్వుతుండగా, టిప్పుసుల్తాన్ కాలంనాటి చారిత్రక సంపద వెలుగులోకి వచ్చింది. 18వ శతాబ్దంలో జరిగిన మైసూర్ యుద్ధంలో వాడిన రాకెట్ గుళ్లు లభించాయి. 23 నుంచి 26 సెంటీమీటర్ల పొడవులో ఉన్న వీటిని యుద్ధాలలో వినియోగించే నిమిత్తం ఈ బావిలో దాచి ఉంచి ఉంటారని ఆర్కియాలజిస్టులు వ్యాఖ్యానించారు.

నెపోలియన్ చక్రవర్తి ఈ తరహా రాకెట్ గుళ్లను వాడారని తెలిపారు. ఈ బావి నుంచి గన్ పౌడర్ వాసన వస్తుండటంతో, 15 మంది ఆర్కియాలజిస్టులు, పనివారు మూడు రోజుల పాటు శ్రమించి వీటిని బయటకు తీశారు. ఇవి సుమారు 1000 వరకూ ఉండటం గమనార్హం. కాగా, టిప్పు సుల్తాన్ 1799లో జరిగిన చివరి ఆంగ్లో - మైసూర్ యుద్ధంలో మరణించాడు. ఈ యుద్ధంలో 'మైసూరియన్ రాకెట్లు'గా గుర్తించిన ఈ రాకెట్ గుళ్లను ఆయన తయారు చేయించి వుంటారని చరిత్రకారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News