priyanka chopra: ప్రియాంక చోప్రాపై మండిపడ్డ బాలీవుడ్ నిర్మాత!

  • సల్మాన్, ప్రియాంక కాంబినేషన్లో 'భారత్' చిత్రం
  • పెళ్లి నేపథ్యంలో సినిమా నుంచి తప్పుకున్న ప్రియాంక
  • ప్రియాంకకు వృత్తి పట్ల నిబద్ధత లేదన్న నిఖిల్ నమిత్

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాపై నిర్మాత నిఖిల్ నమిత్ మండిపడ్డారు. సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న 'భారత్' సినిమాలో ఆయన సరసన నటించేందుకు ప్రియాంక సంతకం చేసింది. అయితే, అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ తో పెళ్లి నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఆమె అకస్మాత్తుగా తప్పుకుంది. ఈ నేపథ్యంలో ప్రియాంకపై ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన నిఖిల్ స్పందించారు. సినిమా నుంచి తప్పుకుంటున్నానని రెండు రోజుల ముందు ప్రియాంక తమతో చెప్పిందని... అకస్మాత్తుగా ఆమె ఈ నిర్ణయం తీసుకుందని... ఆమెకు వృత్తి పట్ల నిబద్ధత లేదని అన్నారు.

సినిమా నుంచి ప్రియాంక తప్పుకోవడంతో... వేరే హీరోయిన్ ను వెతికే పనిలో దర్శకనిర్మాతలు పడ్డారు. అయితే సల్మాన్ ఖాన్ మాత్రం కత్రినా కైఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లలో ఎవరో ఒకరిని తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. సల్లూ భాయ్ సరసన టైగర్ జిందా హై, ఏక్ థా టైగర్, మైనే ప్యార్ క్యో కియా చిత్రాల్లో కత్రినా నటించింది. కిక్, రేస్-3 సినిమాల్లో జాక్వెలిన్ నటించింది.  

priyanka chopra
salman khan
bharat movie
marriage
  • Loading...

More Telugu News