Kesineni Nani: జగన్, గాలి ట్రాప్ లో మోదీ పడ్డారు: కేశినేని నాని

  • కీలకమైన సమయంలో వైసీపీ పారిపోయింది
  • మోదీ విదేశీ పర్యటనలకే పరిమితమయ్యారు
  • బీజేపీ,కాంగ్రెస్ లకు టీడీపీ సమదూరంలో ఉంది

ప్రధాని నరేంద్ర మోదీపై టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. మోదీ చెప్పినట్టు వైసీపీ ట్రాప్ లో టీడీపీ పడలేదని... జగన్, గాలి జనార్దనరెడ్డి ట్రాప్ లోనే మోదీ పడ్డారని అన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన కీలకమైన సమయంలో వైసీపీ పారిపోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో టీడీపీ విజయవంతమైందని చెప్పారు. ఓవైపు దేశ ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంటే... మరోవైపు మోదీ మాత్రం విదేశీ పర్యటనలకే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. బీజేపీ, కాంగ్రెస్ లకు టీడీపీ సమదూరంలో ఉందని చెప్పారు. 

Kesineni Nani
jagan
gali janardhan reddy
modi
special status
Telugudesam
bjp
  • Loading...

More Telugu News