Yogi Adityanath: యోగి ఆదిత్యనాథ్ కాళ్లు మొక్కిన పోలీస్ ఆఫీసర్.. వైరల్ గా మారిన ఫొటోలు!

  • యోగి ఆశీర్వాదం తీసుకున్న గోరఖ్ పూర్ సర్కిల్ అధికారి ప్రవీణ్
  • ఆన్ లైన్ లో వైరల్ గా మారిన ఫొటోలు
  • పోలీస్ అధికారి వైఖరిపై ఇంటర్నెట్ లో మిశ్రమ స్పందన

ఉత్తరప్రదేశ్ కు చెందిన సీనియర్ పోలీస్ అధికారి ఒకరు యూనిఫామ్ లోనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాళ్లు మొక్కారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారగా, నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. గోరఖ్ పూర్ సర్కిల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ సింగ్.. గురు పూర్ణిమ సందర్భంగా శుక్రవారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముందు మోకరిల్లారు. అనంతరం యోగికి తిలకం దిద్ది, పూలమాలతో సత్కరించారు. ఈ ఫొటోలను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన సింగ్.. ‘నేను అదృష్టవంతుడిని’ అని స్టేటస్ ను మార్చారు.

ఓ పోలీస్ అధికారి యూనిఫామ్ లో రాజకీయ నేత యోగి ముందు మోకరిల్లడంపై ఇంటర్నెట్ లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. పోలీస్ అధికారై ఉండి ఇలా నేతల ముందు మోకరిల్లవచ్చా? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. మిగతా మతాలకు చెందిన పోలీస్ అధికారులు కూడా యూనిఫామ్ లోనే మత సంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఇంకొందరు సింగ్ కు మద్దతుగా నిలిచారు. యోగి ఆదిత్యనాథ్ శక్తిమంతమైన గోరఖ్ పూర్ మఠానికి అధిపతి అనీ, చాలా మంది ఆయన ఆశీర్వాదం తీసుకుంటారని మరికొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు.

Yogi Adityanath
Uttar Pradesh police
Uttar Pradesh
praveen kumar singh
gorakhpur
Facebook
viral
circle officer
  • Loading...

More Telugu News