karunanidhi: బ్రేకింగ్.. కరుణానిధి ఆరోగ్యంపై బులెటిన్ విడుదల!

  • చికిత్సకు స్పందిస్తున్నారన్న కావేరీ ఆస్పత్రి యాజమాన్యం
  • ఆస్పత్రిలోకి దూసుకెళ్లిన కార్యకర్తలు, అడ్డుకున్న పోలీసులు
  • కరుణ ఆరోగ్యంపై తమిళనాడు గవర్నర్ ఆరా

డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యంపై ఆయన చికిత్స పొందుతున్న కావేరీ ఆస్పత్రి యాజమాన్యం శనివారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం కరుణానిధి ఆరోగ్యం స్థిరంగా ఉందనీ, ఆయన కోలుకుంటున్నారని బులెటిన్ లో వైద్యులు తెలిపారు. ఆయన బీపీ కూడా అదుపులోనే ఉందని వెల్లడించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటక ఒక్కసారిగా బీపీ పడిపోవడంతో ఆయన్ను కుటుంబసభ్యులు హుటాహుటిన కావేరీ ఆస్పత్రికి తరలించారు.


కరుణానిధిని అర్ధరాత్రి ఆస్పత్రికి తరలించడంతో డీఎంకే కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. దీంతో వేలాది మంది పార్టీ కార్యకర్తలు శనివారం ఉదయం తమ అభిమాన నేతను చూసేందుకు ఆస్పత్రిలోకి దూసుకెళ్లారు. అక్కడే భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆస్పత్రి వైద్యులతో నేడు ఫోన్ లో మాట్లాడిన తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్.. కరుణ ఆరోగ్యంపై వాకబు చేశారు.

karunanidhi
Tamil Nadu
DMK
HEALTH BULLETIN
  • Loading...

More Telugu News