Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • గోపీచంద్ సరసన తొలిసారిగా కాజల్
  • పెళ్లి వార్తలను ఖండించిన తమన్నా 
  • సుకుమార్ బాలీవుడ్ సినిమాకి పర్యవేక్షకుడు 

*  యాక్షన్ హీరో గోపీచంద్ తో తొలిసారిగా కాజల్ అగర్వాల్ జోడీ కట్టనుంది. నూతన దర్శకుడు కుమార్ సాయి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించే చిత్రంలో గోపీచంద్, కాజల్ జంటగా నటించనున్నట్టు తాజా సమాచారం.
*  అమెరికాలో స్థిరపడిన ఓ ఎన్నారై డాక్టర్ ని కథానాయిక తమన్నా పెళ్లాడనుందంటూ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని, ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన కూడా తనకు లేదని తమన్నా తాజాగా వివరణ ఇచ్చింది. ఇలాంటి నిరాధార వార్తలను నమ్మవద్దని అభిమానులను కోరింది.
*  వరుణ్ ధావన్ హీరోగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ హిందీలో ఓ చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించే ఈ చిత్రానికి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ పర్యవేక్షకుడిగా వ్యవహరిస్తారు.  

Kajal Agarwal
Thamanna
  • Loading...

More Telugu News