New Delhi: ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ.. ఢిల్లీలో సెల్ టవరెక్కిన తెలంగాణ వాసి!

  • ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో సంఘటన
  • ‘ప్రత్యేకహోదా’ ఇవ్వాలని డిమాండ్
  • ఐదు కోట్ల ఆంధ్రులకు న్యాయం జరగాలన్న యువకుడు

ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణకు చెందిన ఓ యువకుడు ఢిల్లీలో హల్ చల్ చేశాడు. వరంగల్ కు చెందిన యువకుడు ఉమేష్ రెడ్డి ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో సెల్ టవర్ ఎక్కాడు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అక్కడే నిలబడ్డాడు. ఐదు కోట్ల మంది ఆంధ్రులకు న్యాయం జరగాలని, ఏపీకి హోదా ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

ఈ క్రమంలో ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) అధికారులు రంగంలోకి దిగారు. సెల్ టవర్ పై ఉన్న అతనితో ఫోన్ లో సంప్రదింపులు జరిపారు. ఇన్నేళ్లుగా రాష్ట్రానికి మోదీ ఏం చేశారు? అమరావతి శంకుస్థాపనకు వచ్చిన మోదీ, చెంబు నీళ్లు ఇచ్చిపోతారా? అని అతను ప్రశ్నించాడు. ఎట్టకేలకు, అతన్ని సెల్ టవర్ పై నుంచి అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కిందకు దింపారు. 

New Delhi
Special Category Status
warangal youth
  • Loading...

More Telugu News