Chandrababu: ఎమ్మెల్యేలు బొల్లినేని, పెందుర్తిలపై చంద్రబాబు ఆగ్రహం

  • ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఉపేక్షించను
  • పార్టీ ప్రతిష్టను దిగజార్చితే ఊరుకోను
  • టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో చంద్రబాబు 

రేణిగుంట ఎయిర్ పోర్టులో చిత్తూరు జాయింట్ కలెక్టర్ గిరీషా, రేణిగుంట తహసీల్దారు నర్సింహులుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి కలెక్టరేట్ వద్ద అధికారులకు వ్యతిరేకంగా తమ పార్టీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్ ఇటీవల నిరసన తెలపడంపైనా ఆయన మండిపడ్డారు.

ఈ రోజు అమరావతిలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, అధికారుల పట్ల ఎమ్మెల్యేలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఉపేక్షించనని హెచ్చరించారు. పార్టీ ప్రతిష్టను దిగజార్చే వారిని వదులుకునేందుకూ సిద్ధమేనని అన్నారు.

Chandrababu
mla bollineni
mla pendurthi
  • Loading...

More Telugu News