Niharika: సినిమాలో చాన్స్ కావాలని చరణ్ ను అడిగితే డైరెక్టర్ ని అడగమన్నాడు!: నీహారిక

  • రేపు విడుదలకు సిద్ధమైన 'హ్యాపీ వెడ్డింగ్'
  • ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా నీహారిక
  • సురేందర్ వెంటనే ఒప్పుకున్నాడన్న మెగా హీరోయిన్

ప్రస్తుతం తాను నటించగా, రేపు విడుదలకు సిద్ధమైన 'హ్యాపీ వెడ్డింగ్' ప్రమోషన్ లో బిజీగా ఉన్న మెగా హీరోయిన్ నీహారిక, తనకు పెదనాన్న చిరంజీవి హీరోగా నిర్మితమవుతున్న 'సైరా'లో ఎలా అవకాశం వచ్చిందన్న విషయాన్ని మీడియాతో పంచుకుంది. సినీ పరిశ్రమలో కాలుమోపినప్పటి నుంచి చిరంజీవితో ఒక్క సీన్ లో నైనా నటిస్తే చాలని అనుకుంటూ ఉండేదాన్నని చెప్పింది.

ఈ క్రమంలో 'సైరా'లో తనకు ఒక్క చాన్స్ కావాలని చరణ్ అన్నయ్యను అడిగితే, తనకు తెలియదని, సురేందర్ రెడ్డిని అడగాలని చెప్పాడని, తాను సురేందర్ రెడ్డిని అడుగగా, వెంటనే ఒప్పుకున్నాడని చెప్పింది. ఈ చిత్రంలో తాను ఓ బోయ యువతిగా కనిపిస్తానని పేర్కొంది. తనపై వచ్చే గాసిప్స్ గురించి ఏ మాత్రమూ పట్టించుకోనని, ఓ నాలుగేళ్ల పాటు సినిమాల్లో చేసిన తరువాత పెళ్లి చేసుకొని చిత్ర నిర్మాణ రంగంలో స్థిరపడతానని వెల్లడించింది. అంతకన్నా ముందు కొన్ని వెబ్ సిరీస్ లు తీసి నిర్మాతగా అనుభవాన్ని పెంచుకుంటానని చెప్పింది.

Niharika
Saira
Chiranjeevi
Ramcharan
  • Loading...

More Telugu News