Nepal: మిలటరీ మెస్ లోకి దూరి నానాయాగీ చేసిన ఏనుగు... వీడియో చూడండి!

  • నేపాల్ సరిహద్దుల్లో ఘటన
  • బిన్నాగురి కంటోన్మెంట్ లోకి వచ్చిన గజరాజు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఇంతకన్నా మరో ఉదాహరణ ఉండదేమో. నేపాల్ సరిహద్దుల్లోని అడవుల్లో ఉండాల్సిన గజరాజు, అక్కడ తిండి దొరకక సమీపంలోని ఇండియన్ మిలటరీ మెస్ లోకి దూరి నానాయాగీ చేసింది. అక్కడి గోడను బద్దలుకొట్టింది. బిన్నాగురి కంటోన్మెంట్ లో అధికారులు భోజనం చేసే గదిలోకి వచ్చిన ఏనుగు ఆహారం కోసం కలియదిరిగింది.

ఈ క్రమంలో తనకు అడ్డొచ్చిన బెంచీలను, కుర్చీలను పక్కకు తోసేసింది. ఈ ప్రాంతంలోకి అడవుల నుంచి విష సర్పాలు నిత్యమూ వస్తుంటాయని, ఏనుగు ఇలా రావడం మాత్రం ఇదే తొలిసారని ఇక్కడి జవాన్లు తెలిపారు. ఈ ఏనుగు చేస్తున్న గొడవను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టగా అదిప్పుడు వైరల్ అవుతోంది. మీరూ చూడండి.

Nepal
India
Border
Elephant
Military
  • Error fetching data: Network response was not ok

More Telugu News