Basanagouda Patil Yatnal: నేనే హోంమంత్రి అయితే.. మేధావుల్ని కాల్చేయమని ఆదేశిస్తా: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే

  • కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ వ్యాఖ్య
  • మేధావులంతా దేశ ద్రోహులని మండిపాటు
  • వీరే దేశానికి అతిపెద్ద ముప్పని హెచ్చరిక

భారత్ కు తాను హోంమంత్రి అయితే దేశంలోని మేధావులు, ఉదారవాదుల్ని కాల్చిచంపాల్సిందిగా పోలీసుల్ని ఆదేశించేవాడినని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ తెలిపారు. మేధావులు, ఉదారవాదులందరూ దేశ ద్రోహులని వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని తన నియోజకవర్గం విజయపురలో గురువారం జరిగిన కార్గిల్ దివస్ వేడుకల సందర్భంగా బసనగౌడ స్పందించారు.

‘వీళ్లు(మేధావులు) మనం కట్టే పన్నులతో ఈ దేశంలో ఉంటూ, సౌఖ్యాలను అనుభవిస్తారు. కానీ భారత సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. మన దేశానికి శత్రువుల కంటే ఇలాంటి మేధావులు, ఉదారవాదుల వల్లే అతిపెద్ద ముప్పు పొంచి ఉంది’ అని పాటిల్ మండిపడ్డారు. కాగా, పనుల కోసం మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చే ముస్లిం మతస్తులకు సాయం చేయొద్దని స్థానిక బీజేపీ నేతలకు ఇటీవల పాటిల్ సూచించారు.

Basanagouda Patil Yatnal
Karnataka
MLA
Police
  • Loading...

More Telugu News