Mahesh Babu: 100 రోజులు పూర్తిచేసుకోనున్న 'భరత్ అనే నేను'

  • కథాకథనాలను పట్టుగా నడిపించిన కొరటాల
  • మహేశ్ బాబు నటనకు నీరాజనాలు 
  • ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన దేవిశ్రీ సంగీతం

కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా 'భరత్ అనే నేను' తెరకెక్కింది. కైరా అద్వాని కథానాయికగా నటించిన ఈ సినిమా, ఏప్రిల్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. మహేశ్ బాబు కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 28వ తేదీన 100 రోజులను పూర్తిచేసుకోనుంది. ఇంతవరకూ ఈ సినిమా సాధించిన రికార్డులలో కొత్తగా 100 రోజుల రికార్డు కూడా చోటుచేసుకోనుంది. మహేశ్ బాబు లుక్ .. ముఖ్యమంత్రిగా ఆయన చూపించిన హుందాతనం .. కొరటాల శివ కథాకథనాలను నడిపించిన తీరు .. కైరా అద్వాని గ్లామర్ .. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధించడానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఎల్లుండి మహేశ్ బాబు అభిమానులు ఆయా థియేటర్ల దగ్గర ఒక రేంజ్ లో సందడి చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.    

Mahesh Babu
kiara adwani
  • Loading...

More Telugu News