sumanth sailendra: ఆకట్టుకుంటోన్న 'బ్రాండ్ బాబు' ట్రైలర్

  • మారుతి అందించిన కథ 
  • కోటీశ్వరుడి తనయుడిగా హీరో 
  • పనిమనిషిగా హీరోయిన్    

తెలుగు తెరకు తనదైన శైలిలో ప్రేమకథను పరిచయం చేయడానికి దర్శకుడు ప్రభాకర్ చేసిన ప్రయత్నమే 'బ్రాండ్ బాబు'. దర్శకుడు మారుతి కథను అందించిన ఈ సినిమాలో సుమంత్  శైలేంద్ర .. ఈషా రెబ్బా జంటగా కనిపించనున్నారు. తాజాగా నాగ చైతన్య చేతుల మీదుగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు.

ఓ శ్రీమంతుడి తనయుడు .. అందునా ప్రతి విషయంలో తనస్థాయికి తగినట్టుగా నంబర్ వన్ 'బ్రాండ్'కి ప్రాముఖ్యతనిచ్చే హీరో .. ఒక పనిమనిషి ప్రేమలో పడటమే ప్రధాన ఇతివృత్తమని ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. లవ్ .. కామెడీ .. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేదిలా వుంది. హీరో తండ్రిగా మురళీ శర్మ పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందనే విషయం ట్రైలర్ ను చూస్తుంటే తెలుస్తోంది. ఆగస్టు 3వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News