Mahesh Babu: మహేశ్ 25వ మూవీ టైటిల్ ను ఆ రోజునే చెప్తారట!

  • వచ్చేనెల 9వ తేదీన మహేశ్ బర్త్ డే 
  • ఆ రోజునే ఫస్టులుక్ విడుదల 
  • ఏప్రిల్ 5వ తేదీన సినిమా రిలీజ్

మహేశ్ బాబు తన 25వ మూవీని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ .. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇక్కడ వేసిన భారీ విలేజ్ సెట్ లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకి టైటిల్ ఏమిటనేది ఇంతవరకూ చెప్పలేదు. దాంతో ఈ విషయంపై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతూ వెళుతోంది.

మహేశ్ బాబు పుట్టిన రోజైన ఆగస్టు 9వ తేదీన టైటిల్ తో కూడిన ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారనేది తాజా సమాచారం. మహేశ్ అభిమానులకు ఇది ఆయన బర్త్ డే గిఫ్ట్ అన్నమాట. ఈ సినిమాలో మహేశ్ బాబు కాలేజ్ స్టూడెంట్ గాను .. రైతు సమస్యలపై పోరాడే యువకుడిగాను కనిపించనున్నాడని అంటున్నారు. ప్రేమ .. స్నేహం .. ఫ్యామిలీ ఎమోషన్స్ .. రివేంజ్ ప్రధానంగా ఈ సినిమా కొనసాగుతుందని చెబుతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.  

  • Loading...

More Telugu News