Aids: 'నాకు ఎయిడ్స్ ఉంది... కౌగిలించుకుంటారా?' అని రోడ్డెక్కిన 16 ఏళ్ల అమ్మాయి... వైరల్ అవుతున్న వీడియో!

  • ఎయిడ్స్ పై ప్రజల్లో అపోహలు
  • వినూత్న కార్యక్రమం చేపట్టిన యునిసెఫ్
  • ఎయిడ్స్ ఉన్న యువతిని అక్కునజేర్చుకున్న ప్రజలు

ప్రాణాంతక మహమ్మారి ఎయిడ్స్ పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ఉజ్బెకిస్థాన్ కు చెందిన 16 ఏళ్ల అమ్మాయి అజ్మా వినూత్న ప్రచారం చేపట్టగా, సోషల్ మీడియాలో అది వైరల్ అయింది. తాష్కెంట్ వీధుల్లో "నేను హెచ్ఐవీ పాజిటివ్. కౌగిలించుకోండి" అని రాసున్న ప్లకార్డు ప్రదర్శిస్తూ నిలబడింది.

మరో ప్లకార్డులో 10 ఏళ్ల నుంచి హెచ్ఐవీ ఉన్నా, తనకేమీ కాలేదని, తన జీవితాన్ని చక్కగా గడుపుతున్నానని చెప్పింది. ఎవరైనా కౌగిలించుకుంటే, తన కుటుంబ సభ్యులే కౌగిలించుకున్నట్టు భావిస్తానని చెప్పింది. ఇక ఈ ప్లకార్డులు చూసిన పలువురు స్పందించి, ఆమెను అక్కున చేర్చుకున్నారు. అజ్మాకు ధైర్యం చెప్పారు. ఎయిడ్స్ అంటువ్యాధి కాదని, వ్యాధి ఉన్నవారితో భోజనం పంచుకున్నా, వారిని తాకినా వ్యాధి సోకదని అవగాహన కల్పించేందుకు యునిసెఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

Aids
Uzbekisthan
  • Error fetching data: Network response was not ok

More Telugu News