Rahul Gandhi: బీజేపీ ఎంపీలు నా దెబ్బకు పారిపోతున్నారు: రాహుల్

  • నాకు ద్వేషించడం తెలియదు
  • నేనెక్కడ హగ్ ఇస్తానోనని రెండడుగులు వెనక్కి వేస్తున్నారు
  • అద్వానీతోనూ పోరాడగలను

తనను చూసి బీజేపీ ఎంపీలు రెండడుగులు వెనక్కి వేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తానెక్కడ వారిని కౌగిలించుకుంటానోనని పరుగులు తీస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలపై తనకు ప్రత్యేక అభిప్రాయం ఉందన్న రాహుల్, అంతమాత్రాన వారిని అసహ్యించుకోబోనని స్పష్టం చేశారు. వారిపై తనకెలాంటి కోపం లేదన్నారు. ఎవరితోనైనా పోరాడాలని అనుకుంటున్నప్పుడు వారిని ద్వేషించడం ఒక ఆప్షన్ మాత్రమేనని, తానైతే వారిని అర్థం చేసుకోవడానికే ప్రయత్నిస్తానని అన్నారు. ఈ దేశంపై తనకు ప్రత్యేక భావన ఉందన్నారు.

బీజేపీ సీనియర్ నేత అద్వానీతో తాను విభేదిస్తున్నానని పేర్కొన్న రాహుల్, ఆయనతో తాను అంగుళం అంగుళం పోరాడగలనని తేల్చి చెప్పారు. అంతమాత్రాన ఆయనపై ద్వేషం పెంచుకోబోనన్నారు. ఢిల్లీలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు.

Rahul Gandhi
BJP
Hug
Congress
  • Loading...

More Telugu News