America: ట్రంప్‌కు చిక్కులు తెచ్చిపెడుతున్న ప్లేబోయ్ మాజీ మోడల్.. రహస్య టేపుల కొనుగోలుకు చర్చలు!

  • ప్లేబోయ్ మాజీ మోడల్‌తో ట్రంప్ వ్యవహారం
  • ఆమె స్టోరీని కొనుగోలు చేసేందుకు ట్రంప్ చర్చలు
  • గతవారమే ఓ టాబ్లాయిడ్‌కు విక్రయించిన కారెన్

ప్లేబోయ్ మాజీ మోడల్ కారెన్ మెక్‌డౌగెల్‌తో గతంలో వ్యవహారం నడిపిన అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమె కథకు సంబంధించిన హక్కులను కొనుగోలు చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ మేరకు ఆయన వ్యక్తిగత న్యాయవాదితో చర్చలు జరుపుతున్న ట్రంప్ ఆడియోను సీఎన్ఎన్ మంగళవారం బయటపెట్టింది.

2016 ఎన్నికలకు రెండు నెలల ముందు ట్రంప్ మాజీ అటార్నీ జనరల్ మైఖెల్ కోహెన్ ఈ టేప్‌ను రహస్యంగా రికార్డు చేశారు. గతవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది కోహెన్ కార్యాలయంపై ఎఫ్‌బీఐ సోదాలు నిర్వహించి టేప్‌ను స్వాధీనం చేసుకున్నట్టు న్యూయార్క్ టైమ్స్ గతవారం పేర్కొంది. ఇప్పుడీ టేప్ బయటపడి సంచలనమైంది.  

ఈ టేపులో కోహెన్‌తో ట్రంప్ మాట్లాడడం స్పష్టంగా వినిపిస్తోంది. ముఖ్యంగా మోడల్ కి చెందిన స్టోరీ కొనుగోలు గురించి వీరిద్దరూ మాట్లాడుకున్నారు. నిజానికి ఈ స్టోరీని ఈ నెల మొదట్లోనే సదరు మోడల్ ఓ టాబ్లాయిడ్‌కు 1.50 లక్షల డాలర్లకు విక్రయించింది. అయితే, ఈ టేపును కొనుగోలు చేసినప్పటికీ టాబ్లాయిడ్ ఇప్పటి వరకు ప్రచురించలేదు.

ట్రంప్‌తో జరిగిన సంభాషణలో కోహెన్ తానో కంపెనీని ప్రారంభించాలని యోచిస్తున్నట్టు చెప్పారు. అమెరికన్ మీడియా ఎంక్వైరర్‌ను సొంతం చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. అయితే, తాము నగదు రూపంలో చెల్లించలేమని ట్రంప్ తేల్చి చెప్పగా, ‘నో.. నో’ అన్న కోహెన్ మాటలు వినిపించాయి. అ తర్వాత స్పష్టత కరువైంది. ఇప్పుడీ టేప్ వ్యవహారం అమెరికాలో చర్చనీయాంశమైంది. ట్రంప్‌ను మరోమారు చిక్కుల్లో పడేసేలా ఉంది.

America
Donald Trump
Playboy Moder
Karen McDougal
  • Loading...

More Telugu News