Andhra Pradesh: జగన్ వ్యాఖ్యలు విని షాకయ్యా: మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

  • పవన్ వ్యాఖ్యల్లో తప్పులేదు
  • వ్యక్తిగత విమర్శలు సరికాదు
  • జగన్ పూర్తిగా డిప్రెషన్‌లో ఉన్నారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని తాము కూడా విమర్శిస్తున్నామని, అయితే వ్యక్తిగతంగా ఎప్పుడూ ఎటువంటి విమర్శలు చేయలేదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. పవన్‌పై జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన.. పవన్ వ్యక్తిగత జీవితంపై మాట్లాడడం సరికాదన్నారు. జగన్ అలాంటి వ్యాఖ్యలు చేస్తారని ఊహించలేదన్నారు. పవన్ పలుమార్లు వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని, ఉద్దానం సమస్యపై ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు సమస్య పరిష్కారం కోసం చంద్రబాబు ప్రయత్నించారని గుర్తు చేశారు.

పోరాటం ఎప్పుడూ రాజకీయంగా ఉండాలి తప్పితే, ఎదుటి వ్యక్తిని ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదన్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా జగన్ తప్పు చేస్తున్నారన్న పవన్ విమర్శల్లో తప్పేముందని అన్నారు. జగన్ పూర్తిగా డిప్రెషన్‌లో ఉన్నారని అర్థమైందని, ఎమ్మెల్యేలలో కూడా అది కనిపిస్తోందని సోమిరెడ్డి అన్నారు.

Andhra Pradesh
Jagan
Pawan Kalyan
somireddy
  • Loading...

More Telugu News