Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు జగన్ క్షమాపణలు చెప్పాలి: ఏపీ కాపునాడు డిమాండ్

  • జగన్ అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నాం
  • ఆ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి
  • లేనిపక్షంలో జగన్ పాదయాత్రను అడ్డుకుంటాం

పవన్ కల్యాణ్ పై వైఎస్ జగన్ చేసిన తీవ్ర వ్యాఖ్యలను ఏపీ కాపునాడు అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు ఖండించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కాపుల ఆశాజ్యోతి పవన్ కల్యాణ్ పై జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు. పవన్ వైవాహిక జీవితంపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, పవన్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

అలా చేయని పక్షంలో జగన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కాపు సమాజం హెచ్చరిస్తోందని అన్నారు. పవన్ కు క్షమాపణలు చెప్పే వరకు జగన్ పాదయాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఏపీలోని కాపు సామాజిక వర్గం యావత్తు ముక్తకంఠంతో జగన్ వ్యాఖ్యలను ఖండించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అవినీతికి మారుపేరైన జగన్ జైలు చరిత్ర అందరికీ తెలిసిందేనని, అంతేకాకుండా, జగన్ రాసలీలల గురించి మేము నోరు విప్పితే ఆయనకు, తమకు తేడా ఉండదని, అందుకే, ఆ విషయాల జోలికి వెళ్లడం లేదని అన్నారు.

Pawan Kalyan
jagan
ap kapunadu
  • Error fetching data: Network response was not ok

More Telugu News