paruchuri: అందువల్లనే చిరంజీవిగారు వినాయక్ ను రంగంలోకి దింపారు: పరుచూరి గోపాలకృష్ణ

  • మురుగదాస్ వినిపించుకోలేదు 
  • చిరంజీవి .. వినాయక్ ను తీసుకున్నారు 
  • ఆ డైలాగ్ చిరంజీవికి బాగా నచ్చింది     

వినాయక్ తో కలిసి 'ఆది' .. 'చెన్నకేశవరెడ్డి' సినిమాలకి పనిచేసిన పరుచూరి గోపాలకృష్ణ, ఆ తరువాత ఆయనతోనే 'ఠాగూర్' సినిమాకి చేశారు. ఆ సినిమాకి సంబంధించిన విశేషాలను తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.

"వినాయక్ తో మేము చేసిన సినిమాల్లో చరిత్ర సృష్టించింది 'ఠాగూర్'. ముందుగా ఈ సినిమాకి దర్శకుడిగా మురుగదాస్ నే అనుకున్నారు. కానీ మేం చెబుతున్న మార్పులను చేయడానికి ఆయన ఇష్టపడటం లేదు. అప్పుడు మా అన్నయ్య . 'ఇలా అయితే కష్టం' అన్నట్టుగా చిరంజీవిగారితో చెప్పాడు. అయితే వినాయక్ తో చేయిద్దామని ఆయనను రంగంలోకి దింపారు.

ఒక రోజున నేను రవీంద్రభారతిలో ఉండగా వినాయక్ వచ్చాడు. ఏంటి? అని అడిగితే .. 'షాయాజీ షిండేను కొట్టే సన్నివేశంలో ఒక పవర్ ఫుల్ డైలాగ్ పడితే బాగుంటుందని చిరంజీవి గారు అనుకుంటున్నారు" అంటూ నాకు సీన్ పేపర్ ఇచ్చాడు. అప్పుడు నేను అక్కడ ఒక డైలాగ్ రాశాను .. అప్పుడు వినాయక్ నవ్వి .. 'చిరంజీవి ఎందుకు మిమ్మల్ని ఇంతగా నమ్ముతారనేది ఇప్పుడు అర్థమైంది' అన్నాడు. ఆ డైలాగే .. 'నీ కంఠంలోని నరాలు తెంచి నా బూటుకి లేసులుగా కట్టుకుంటా'. ఆ డైలాగ్ చూసిన చిరంజీవి వెంటనే ఫోన్ చేసి అభినందించారు .. 'ఆ స్థాయిలో డైలాగ్ పడితేనే గాని .. ఆ సీన్ పండదు' అని అన్నారు.    

  • Loading...

More Telugu News