paruchuri: వినాయక్ తో విభేదించాను .. కోపంతో రాయనని చెప్పాను: పరుచూరి గోపాలకృష్ణ

  • 'ఆది' సినిమాకి పనిచేశాను 
  • ఆ రెండు సీన్స్ అలా వద్దని చెప్పాను 
  • వినాయక్ వినిపించుకోలేదు  

రచయితగా ఎంతోమంది దర్శకులతో పరుచూరి బ్రదర్స్ కలిసి పనిచేశారు .. ఎన్నో అనుభవాలను మూటగట్టుకున్నారు. ఆ విషయాలను తాజాగా 'పరుచూరి పలుకులు' ద్వారా పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు. "వినాయక్ తో కలిసి 'ఆది' సినిమాకి పనిచేశాను. విలన్ ఇంటికి ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఇతను కారును వాళ్లు పేల్చేస్తే .. వాళ్ల నాలుగు కార్లను ఎన్టీఆర్ పేల్చేస్తాడు. ఆ సీన్ అలా వద్దని చెప్పాను .. చలపతిరావు డెత్ సీన్ విషయంలోనూ అభ్యంతరం వ్యక్తం చేశాను.

ఈ విషయంలో తను చెప్పినట్టుగా వినమంటూ వినాయక్ రిక్వెస్ట్ చేశాడు. రెస్పాన్స్ చూసిన తరువాత వినాయక్ చేసినదే కరెక్ట్ అనిపించింది. ఈ రెండు సీన్స్ విషయంలో నేను వినాయక్ తో ఎంతగా విభేదించానంటే, ఆ తరువాత ఆయన సినిమాకి పనిచేయనని చెప్పాను. వినాయక్ ను వెంటబెట్టుకుని మా ఇంటికి వచ్చిన 'దిల్' రాజు .. 'దిల్' సినిమాకి రాయమన్నాడు. వినాయక్ మా మాట వినడంటూ నేను ఒప్పుకోలేదు .. రాయను పొమ్మన్నాను. 'ఆది' హిట్ తరువాత .. ఒక్కొక్కప్పుడు అవతలవాళ్లు చెప్పింది కూడా కరెక్ట్ అవుతుంది .. మనం కూడా తెలుసుకోవాలి' అనే విషయం నాకు అర్థమైంది' అని చెప్పుకొచ్చారు.   

  • Loading...

More Telugu News