gulam nabi azad: ఆజాద్ ఆంధ్రప్రదేశ్ పక్షపాతి: కర్నె ప్రభాకర్

  • ఏపీపై ప్రేమ ఉందంటూ పక్షపాతాన్ని బయటపెట్టారు
  • తెలంగాణకు అన్యాయం జరిగినా సరే.. ఏపీకి న్యాయం జరగాలనుకుంటున్నారు
  • ఆజాద్ వ్యాఖ్యలపై ఉత్తమ్ స్పందించాలి

కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్ పట్ల పక్షపాతాన్ని బయటపెట్టారని మండిపడ్డారు. ఏపీపై తమకు ప్రేమ ఉందని చెప్పడంతో... కాంగ్రెస్ వైఖరి ఏమిటో బట్టబయలైందని చెప్పారు. ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు అన్యాయం జరిగినా పర్లేదు... ఏపీకి మేలు జరగాలనేదే కాంగ్రెస్ అభిమతమని మండిపడ్డారు. విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చితే తమకు అభ్యంతరం లేదని... కానీ, పరిధి దాటి ముందుకు వెళ్తే మాత్రం తాము ఒప్పుకోబోమని హెచ్చరించారు.  

gulam nabi azad
ap
Telangana
karne prabhakar
Uttam Kumar Reddy
  • Loading...

More Telugu News