nithin: అదే సెంటిమెంట్ ను కొనసాగిస్తోన్న దిల్ రాజు

- దిల్ రాజు నుంచి మరో కుటుంబ కథా చిత్రం
- నితిన్ సరసన నాయికగా రాశి ఖన్నా
- ఆగస్టు 9వ తేదీన భారీస్థాయి విడుదల
కుటుంబ కథా చిత్రాలను నిర్మించడంలో దిల్ రాజు ముందుంటారు. అలాంటి కంటెంట్ తో వచ్చిన సినిమాలు ఆయనకి విజయాలను అందించాయి. 'బొమ్మరిల్లు' .. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' .. 'శతమానం భవతి' సినిమాలు అందుకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంటాయి. 'శతమానం భవతి' సినిమా విడుదలకి ఒక వారం రోజుల ముందుగా, ఆ సినిమాకి పనిచేసిన వాళ్లందరి కోసం దిల్ రాజు ఒక స్పెషల్ షో వేశారు. ఆ సినిమాకి పనిచేసిన వాళ్లంతా తమ కుటుంబసభ్యులతో కలిసి వచ్చి చూసేలా ఆయన ఏర్పాటు చేశారు. ఆ సినిమా అనూహ్యమైన విజయాన్ని అందుకుంది.
