hafiz saeed: పాకిస్థాన్ ఎన్నికల్లో ఓటు వేసిన ఉగ్రవాది హఫీజ్ సయీద్
- లాహోర్ లో ఓటు హక్కును వినియోగించుకున్న సయీద్
- ప్రతి ఒక్కరూ ఓటు వేయాలంటూ పిలుపు
- అల్లాహో అక్బర్ తెహ్రీక్ తరపున పోటీ చేస్తున్న సయీద్ అనుచరులు
లష్కరే తాయిబా సహవ్యవస్థాపకుడు, జామాత్ ఉద్దవా చీఫ్, ముంబై 26/11 దాడుల మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్... పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. లాహోర్ లోని వఫాకీ కాలనీలో ఉన్న ఓ పోలింగ్ బూత్ లో ఓటు వేశాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ, "ఇప్పుడే ఓటు వేశా. ఇక్కడి వాతావరణం చాలా బాగుంది. ఎలాంటి సమస్యలు లేవు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి" అని తెలిపాడు.
హఫీజ్ సయీద్ కు చెందిన పార్టీ మిల్లి ముస్లిం లీగ్ (ఎంఎంఎల్) కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. అయితే ఈ పార్టీకి పాకిస్థాన్ ఎన్నికల కమిషన్ గుర్తింపును ఇవ్వడానికి నిరాకరించడంతో... ఈ పార్టీ అభ్యర్థులు అల్లాహో అక్బర్ తెహ్రీక్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు.