Sri Reddy: తానేమీ వ్యభిచారిని కానంటూ మీడియాపై శ్రీరెడ్డి మండిపాటు!

  • శ్రీరెడ్డిపై వ్యభిచారం కేసు
  • అరెస్ట్ అయ్యిందంటూ కొన్ని చానళ్లలో వార్తలు
  • డబ్బుల కోసం అసత్యాలు సృష్టిస్తున్నారని విమర్శలు

తనపై వ్యభిచారం కింద కేసు నమోదైందని, అరెస్ట్ చేశారని కొన్ని టీవీ చానళ్లలో, యూ ట్యూబ్ లో వస్తున్న వార్తలపై నటి శ్రీరెడ్డి మండిపడింది. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టును పెడుతూ, తాను వ్యభిచారం కేసులో అరెస్ట్ అయ్యానంటూ కొన్ని మీడియా, యూ ట్యూబ్ చానల్స్ రూమర్స్ ను ప్రసారం చేస్తున్నాయని ఆరోపించింది.

 తానేమీ వ్యభిచారిని కాదని చెప్పిన ఆమె, డబ్బుకోసం అమ్మాయిని వాడుకుంటున్న మీరే వ్యభిచారం చేస్తున్నట్టని, డబ్బుల కోసం అసత్యాలను సృష్టిస్తున్నారని నిప్పులు చెరిగింది. మీలాంటి మీడియా చీడ పురుగుల కన్నా వ్యభిచారం చేసే అమ్మాయి ఎంతో బెటరని, కొన్ని యూ ట్యూబ్ చానల్స్ కు ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నట్టు చెప్పింది.

Sri Reddy
Prostitution
You Tube Channels
News Channels
  • Error fetching data: Network response was not ok

More Telugu News