Jagan: రాజకీయంగా ఎదుర్కోలేక నీచమైన భాష వాడతారా?: పవన్‌పై జగన్ విమర్శలపై బుద్ధా
- జగన్‌ది నీచమైన భాష
- ఆయన వ్యాఖ్యలకు సభ్యసమాజం తలదించుకుంది
- చేతనైతే రాజకీయంగా ఎదుర్కోండి
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. పవన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక ఇలా వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదన్నారు. పవన్‌పై వాడిన భాష నీచంగా ఉందన్నారు. జగన్ వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. జగన్ వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
ఏపీలో బంద్ నిర్వహించిన జగన్ అది ముగిశాక మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌పై తొలిసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వ్యక్తిగత విమర్శలు చేశారు. పవన్ కారును మార్చినంత ఈజీగా పెళ్లాలను మార్చేస్తాడని, ఇటువంటి వ్యక్తి దొరకడం మన ఖర్మ అని అన్నారు. ‘‘నలుగురు.. నలుగురు పెళ్లాలు. కొత్త కారును మార్చినట్టుగా పెళ్లాన్ని మారుస్తాడు. నాలుగేళ్లకోసారో ఐదేళ్లకోసారో పెళ్లాన్ని మారుస్తాడు. మీరో, నేనో ఈ పని చేస్తే.. ‘నిత్యపెళ్లికొడుకు’ అని బొక్కలో వేస్తారా? లేదా? ఇది పాలీగామీ కాదా? ఇలాంటి వాళ్లు ఎన్నికలకు ఆర్నెల్ల ముందు బయటకొచ్చి.. తానేదో సచ్ఛీలుడను అని మాట్లాడతారు’’ అని జగన్ తీవ్రస్థాయిలో పవన్‌పై విరుచుకుపడ్డారు.