Venkaiah Naidu: వెంకయ్యనాయుడికి క్షమాపణలు చెప్పిన విజయసాయిరెడ్డి!

  • విభజన హామీలపై చర్చలో ప్రసంగించిన విజయసాయి
  • మరింత సమయమివ్వలేదని వాకౌట్ చేసిన వైనం
  • ‘వెంకయ్యనాయుడు పక్షపాతి’ అన్న వైసీపీ ఎంపీ

విభజన హామీలపై రాజ్యసభలో ఈరోజు స్వల్పకాలిక చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ చర్చలో భాగంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రసంగించారు. అయితే, సమయం మించిపోవడంతో మరో సభ్యుడు మాట్లాడేందుకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అవకాశం కల్పించారు.

దీంతో, రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశంపై మాట్లాడేందుకు తనకు తక్కువ సమయం కేటాయించారంటూ వెంకయ్యనాయుడు తీరును విజయసాయిరెడ్డి తప్పుబట్టారు. తన నిరసన తెలియజేస్తూ ‘వెంకయ్యనాయుడు పక్షపాతి’ అని వ్యాఖ్యానిస్తూ సభ నుంచి విజయసాయిరెడ్డి వాకౌట్ చేశారు. అయితే, రాజ్యసభ వాయిదాపడ్డ అనంతరం, వెంకయ్యనాయుడిని విజయసాయిరెడ్డి కలిసి తన క్షమాపణలు చెప్పినట్టు సమాచారం.

Venkaiah Naidu
vijaya sai reddy
  • Loading...

More Telugu News