rwanda: రువాండా లోని ఆదర్శ గ్రామాన్ని సందర్శించి, గోవులను బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోదీ!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-f2b72350b1a5b44fbac54afc35a99c2bbdfc5be7.jpg)
- రువాండా దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీ
- పేదరిక నిర్మూలన కోసం 'గిరింకా' అనే పథకాన్ని అమలు చేస్తోన్న రువాండా
- రెండు రోజుల పాటు మోదీ పర్యటన
ఐదు రోజుల ఆఫ్రికా పర్యటనలో భాగంగా రువాండా చేరుకున్న ప్రధాని మోదీ ఆ దేశంలోని రువేరు ఆదర్శ గ్రామాన్ని సందర్శించి 200 గోవులను బహుమతిగా ఇచ్చారు. పేదరిక నిర్మూలన కోసం 2006లో రువాండా గవర్నమెంట్ 'గిరింకా' అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. పేద ప్రజలకి గోవులను బహుమతిగా అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ఈ పథకంలో భాగంగానే ప్రధాని మోదీ ఆ దేశ ప్రజలకి గోవులను కానుకగా ఇచ్చారు. కాగా, రువాండా దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధానిగా చరిత్ర సృష్టించిన మోదీ, ఆ దేశంలో రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-56c22e04094937f77628fced22f9824ddf51b75a.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-bc78852d4278f1e07e57345919e41dc19f85237e.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-446dcdeb4cdc0420e98452d00722cac2afc264cd.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-1f00f8aa5c93081d857fc6f7eb48fd189f5d6351.jpg)