nithin: ఒక వైపున 'శ్రీనివాస కళ్యాణం' .. మరోవైపున 'విశ్వరూపం 2'

- ఆగస్టు 9న 'శ్రీనివాస కళ్యాణం'
- ఆగస్టు 10వ తేదీన 'విశ్వరూపం 2'
- విభిన్నమైన కథా నేపథ్యాలు కలిగిన చిత్రాలు
దిల్ రాజు నిర్మాతగా .. సతీశ్ వేగేశ్న దర్శకుడిగా 'శ్రీనివాస కళ్యాణం' సినిమా రూపొందింది. నితిన్ .. రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమాను ఆగస్టు 9వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రేమ .. పెళ్లి .. బంధాలు .. అనుబంధాల నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. అందువలన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను అలరించనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి మరే సినిమా పోటీ లేకుండగా చూసుకుని దిల్ రాజు రంగంలోకి దిగాడు.
