Telugudesam mp: శంకరంబాడి సుందరాచారి వేషధారణతో నిరసన తెలిపిన ఎంపీ శివప్రసాద్

  • ఏపీకి అన్యాయం చేయవద్దంటూ గీతాలాపన
  • మోదీ ఏం చేయకపోయినా, చంద్రబాబు ఎంతో కష్టపడుతున్నారన్న ఎంపీ
  • గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టిన టీడీపీ ఎంపీలు

పార్లమెంటు ఆవరణలో టీడీపీ ఎంపీలు తమ నిరసనను ఈరోజు కూడా కొనసాగించారు. ఎంపీ శివప్రసాద్ తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు. 'మా తెలుగు తల్లికి మల్లెపూదండ' గేయ రచయిత శంకరంబాడి సుందరాచారి వేషధారణలో ఆయన నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తెలుగు రాష్ట్రానికి అన్యాయం చేయవద్దంటూ గీతాన్ని ఆలపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రధాని మోదీ ఏమీ చేయకపోయినా... రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారని చెప్పారు.

మరోవైపు, పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు ధర్నా చేపట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని, విశాఖ రైల్వే జోన్ మంజూరు చేయాలని, విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేర్చాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏపీకి న్యాయం జరిగేంత వరకు పోరాటాన్ని ఆపబోమని అన్నారు.

Telugudesam mp
siva prasad
sankarambadi sundarachari
protest
parliament
  • Loading...

More Telugu News