Anil kumble: నేడు మచిలీపట్నానికి అనిల్ కుంబ్లే.. స్టేడియం పనులకు శంకుస్థాపన!

  • రూ.15 కోట్లతో అథ్లెటిక్ స్టేడియం నిర్మాణం
  • కల్నల్ సీకే నాయుడు విగ్రహావిష్కరణ
  • క్రికెట్ దిగ్గజం కోసం పట్టణం ఎదురుచూపు

టీమిండియా దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే నేడు మచిలీపట్నానికి రానున్నాడు. 15 కోట్ల రూపాయలతో పట్టణంలో నిర్మించనున్న తొలి  అథ్లెటిక్ స్టేడియం నిర్మాణ పనులకు కుంబ్లే శంకుస్థాపన చేయనున్నాడు. అలాగే, టీమిండియా తొలి కెప్టెన్ కల్నల్ సీకే నాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నాడు. ఎందరో క్రీడాకారులకు పుట్టినిల్లు అయిన మచిలీపట్నంలో ఇప్పటి వరకు సరైన మైదానం లేదు. ఈ స్టేడియం పూర్తయితే ఆ లోటు తీరుతుంది. నవ్యాంధ్రలోనే ఇది తొలి అథ్లెటిక్ మైదానం కావడం గమనార్హం. స్టేడియం ఏర్పాటు కానుండడంతో కోచ్‌లు, ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుంబ్లే వస్తున్నాడని తెలియడంతో మచిలీపట్నంలో సందడి నెలకొంది.

Anil kumble
Team India
Cricket
Machilipatnam
  • Loading...

More Telugu News