Sri Reddy: శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలంటూ నటుడు వారాహి ఫిర్యాదు!

  • కోలీవుడ్‌కు మకాం మార్చి విరుచుకుపడుతున్న శ్రీరెడ్డి
  • వ్యభిచారం కేసులో అరెస్ట్ చేయాలంటూ ఫిర్యాదు
  • శ్రీరెడ్డి తీరుపై కోలీవుడ్ ఆగ్రహం

తమిళ చిత్రపరిశ్రమలోని నటీనటులపై తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడుతున్న నటి శ్రీరెడ్డిపై నటుడు వారాహి చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తెలుగు చిత్రపరిశ్రమలోని పలువురు ప్రముఖులపై శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి డబ్బులు వసూలు చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పుడు టాలీవుడ్‌ను వదిలేసి కోలీవుడ్‌పై పడిందని ఆరోపించారు. వ్యభిచారాన్ని అంగీకరించిన ఆమెను అదే కేసులో అరెస్ట్ చేయాలని వారాహి తన ఫిర్యాదులో డిమాండ్ చేశారు.

ఇటీవల శ్రీరెడ్డి సంచలన ఆరోపణలతో మరోమారు వివాదానికి తెరలేపింది. ప్రముఖ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్, సుందర్‌.సి, నటుడు రాఘవ లారెన్స్, శ్రీకాంత్‌ (తెలుగులో శ్రీరామ్‌) తదితరులపై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ  హెచ్చరించినా శ్రీరెడ్డి తీరుమారలేదు. చెన్నైలో మకాం పెట్టి మరీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఆమె ఆరోపణలపై కోలీవుడ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నటి త్రిష మాట్లాడుతూ శ్రీరెడ్డి ఎవరో తనకు తెలియదని, ఆమె ఆరోపణలకు బదులివ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.

Sri Reddy
Tollywood
Kollywood
Actor
varahi
  • Loading...

More Telugu News